ఏక్తాకపూర్ సంచలన సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హాట్ ప్రొడ్యూసర్‌గా హాట్ హాట్ సినిమాలు తీస్తూ సంచలనం రేపిన ఏక్తాకపూర్ అంటే అందరికీ తెలుసు కదా? ఈ అమ్మడు చిన్న వయసులోనే నిర్మాతగా సంచలన సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా విద్యాబాలన్‌లాంటి ఏ క్లాస్ నటిని.. సంచలన తారగా మారుస్తూ.. డర్టీ పిక్చర్ తీయడం మామూలు సాహసం కాదు! అలాంటి సాహసం చేసిన ఏక్తాకపూర్ చాలా గట్స్ ఉన్న సినిమాలు తీసింది. ఇప్పుడు ఆమె చూపు గే, లెస్బియన్‌లపై పడిందట. ఆ నేపథ్యంలో ఓ క్రేజీ సినిమాకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. తాజాగా ఈ తరహా సినిమా అంటే ఇండియాలో సంచలనమే అని చెప్పాలి. ఈ తరహా సినిమాలు వచ్చాయి కానీ అవి డి గ్రేడ్‌లోనే రూపొంది, ఎక్కడో విడుదల అయ్యేవి. కానీ ఏక్తాపూర్ తీసేది బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా ప్లాన్ చేస్తుందట. రెగ్యులర్ సినిమాల్లాగే ఉంటుందని, ఇప్పటికే రెండు మగ, రెండు ఆడ జంటలను ఎంపిక చేసిందట. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. మరి ఈ సినిమా విడుదలైతే ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి!