అవకాశాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ప్రారంభంలో శైలజగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ కీర్తి సురేష్. రామ్ సరసన
నటించిన ‘నేను-శైలజ’ చిత్రంలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నటనకు నటన, గ్లామర్‌కు గ్లామర్ కలబోసిన ఈమెకు ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాల జోరు పెరిగింది. ఇప్పటికే పలు చిత్రాల్లో ఈమెను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో నటించిన ఈ భామకు ఇప్పుడు దక్షిణాదిలో మంచి గుర్తింపు దక్కింది. తాజాగా రామ్‌చరణ్ సరసన ఓ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు, మరో క్రేజీ అవకాశం కూడా దక్కినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్
మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని తెలిసింది. ఈ విషయం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టే. మహేష్‌బాబు నటించే తదుపరి చిత్రంలో ఈమె హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసింది. దీంతో కీర్తి సురేష్
టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోవడం ఖాయం.