23న ప్రభాస్ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబల్‌స్టార్ ప్రభాస్ దర్శకుడు సుజీత్‌తో కలిసి కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టీజర్‌కు సంబంధించిన షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఈ చిత్రం ‘బాహుబలి- ది కంక్లూజన్’ తర్వాత పూర్తిస్థాయి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇప్పుడిప్పుడే సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ ఏప్రిల్ 23వ తేదీన రిలీజవుతాయని తెలుస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. అంతేగాక చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 28వ తేదీ నుండి బాబహుబలి ది కంక్లూజన్ ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్‌లలో ప్రదర్శించనున్నారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ టీజర్ ప్రదర్శితమవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మది కెమెరా వర్క్ చేస్తుండగా జాతీయ అవార్డు విజేత, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, పాపులర్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహషాన్, లోయ్‌లు పనిచేయనున్నారు.