మనసైనోడు వచ్చాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్ నందన్, ప్రియాసింగ్ హీరో హీరోయిన్లుగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో నిర్మాత హసీబుద్దీన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనసైనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడాలో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మంచి నటీనటులతో వైవిధ్యభరితంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం 80 శాతం టాకీ పూర్తిచేశాం. చివరి షెడ్యూల్‌లో భాగంగా పోశాని కృష్ణమురళి, హీరో హీరోయిన్లపై సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాం’ అని తెలిపారు. సినారె రాసిన దేశభక్తి గీతం ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటుందని, ప్రేమకథలో కుటుంబ కథను జోడించి దేశానికి ఓ సందేశం అందించేలా సినిమా రూపొందిస్తున్నట్టు చెప్పారు. చిత్రంలో ఆరు పాటలు వేటికవే ప్రత్యేకం అన్నారు. మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రఘుబాబు, గిరిబాబు, కేదార్‌శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చైతన్య, శశాంక, ఫణి, మధుమణి, జ్యోతి తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం సుభాష్ ఆనంద్, పాటలు సినారె, భాస్కరభట్ల, గోసాల రాంబాబు, పూర్ణచారి.