సస్పెన్స్ హారర్ ఎంటర్‌టైనర్ బేబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా సాయిప్రసన్న పిక్చర్స్ పతాకంపై డి.సురేష్ దర్శకత్వంలో బి.వి.ఎన్.పవన్‌కుమార్, కోలవెన్ను ఆంజనేయప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బేబి. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుదల చేస్తున్నారు. షిరాగార్గ్, అంజలీరావు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బేబి శాతన్య, బేబి శ్రీవర్షిణి కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఆడియోను నటుడు సుమన్ విడుదల చేసి తొలి కాపీని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ- భారతీరాజా అబ్బాయి ఈ సినిమా ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉందని, ట్రైలర్స్ అందరికీ నచ్చేలా ఉన్నాయన్నారు. సస్పెన్స్, హారర్ కథాంశంతంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు బి.వి.ఎన్.పవన్‌కుమార్, కోలవెన్ను ఆంజనేయప్రసాద్ తెలిపారు. సినిమాలో హారర్ అంశాలు చూస్తుంటే ఉత్కంఠ కలిగిస్తున్నాయని, ఓ మంచి చిత్రం అవుతుందని ఆర్.పి.పట్నాయక్ అన్నారు. కార్యక్రమంలో శ్రీరంగం సతీష్‌కుమార్, సాయివెంకట్, రమేష్, సిప్రాగౌర్, పాలపర్తి శివకుమార్ శర్మ, భక్తుల కూర్మయ్య, భక్తుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జాన్స్ ఆనంద్, సంగీతం:సతీష్-హరీశ్, ఎడిటింగ్:్భగత్‌సింగ్, మాటలు:రాజశేఖర్‌రెడ్డి, పాటలు:చల్లా భాగ్యలక్ష్మి, దర్శకత్వం:సురేష్.