కృష్ణుడిగా మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించనున్న 1000 కోట్ల ప్రాజెక్టు అన్ని భాషల పరిశ్రమల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా.బి.ఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మహాభారతంలోని అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన భీష్ముడి పాత్రను ఆధారంగా ఈ కథ నడుస్తుంది.
ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ నవల రూపంలో సిద్ధంగా ఉండటంవలన నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టారు దర్శక నిర్మాతలు. ప్రపంచ స్థాయి కాస్టింగ్ కంపెనీ ఈ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తోంది. అందులో భాగంగానే ఇందులో కృష్ణుడి పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబును అనుకుంటున్నట్లు సమాచారం. మహేష్‌తోపాటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పరిశీలనలో ఉన్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.