హరే రామ హరే కృష్ణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన కథానాయకుడు దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా సాయి అరుణాచలేశ్వరా క్రియేషన్స్ పతాకంపై అర్జున్ సాయి దర్శకత్వంలో నవీన్ రెడ్డి.ఎన్ రూపొందిస్తున్న చిత్రం ‘హరే రామ హరే కృష్ణ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశంపై దర్శకుడు చందూ మొండేటి క్లాప్‌నివ్వగా, కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వీరశంకర్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ- కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ స్క్రిప్ట్‌ను తయారుచేశామని, మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. వైవిధ్యమన కథ, కథనాలతో సాగే ఈ చిత్రంలో హెచ్.ఆర్ డిపార్ట్‌మెంట్‌లో కనబడే అమ్మాయి, సంప్రదాయాలకు ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ కళలను కాపాడడానికి ప్రయత్నించే యువతిగా తాను ఈ చిత్రంలో నటిస్తున్నానని రెజీనా అన్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత నవీన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రసూల్ ఎల్లోర్, దిలీప్ ప్రకాష్, బ్రహ్మకడలి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. ప్రకాష్‌రాజ్, ఆమని, నాజర్, కృష్ణ్భగవాన్, కాశీవిశ్వనాథ్, అలీ, పృధ్వీ, నాగినీడు, రచ్చ రవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:రమణ గోపిశెట్టి, కెమెరా:రసూల్ ఎల్లోర్, సంగీతం:అనూప్ రూబెన్స్, నిర్మాత:నవీన్‌రెడ్డి.ఎన్., రచన, దర్శకత్వం:అర్జున్ సాయి.