భయపెట్టి నవ్వించే కీర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఈశ్వరా క్రియేషన్స్ పతాకంపై బెజవాడ ఆనందముని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కీర్తన’. సంస్కారవంతమైన ఓ తెలుగు సినిమా అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నూతన తారాగణం నటించనున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శక నిర్మాత బెజవాడ ఆనందముని తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతిల నేపథ్యంలో సాగే లవ్ అండ్ కామెడీ హర్రర్ ఎంటర్‌టైనర్ కీర్తన. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ప్రతి సన్నివేశం ఉంటుంది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఆద్యంత ఆసక్తిని రేకెత్తించేలా, హృదయాన్ని కదిలించే సెంటిమెంట్ కూడా వుంటుంది. మ్యూజిక్ అధిక ప్రాధాన్యతను ఇస్తూ తెరకెక్కించే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. ఇందులో రెండు జంటలు ఉంటాయి. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. జూలై షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేస్తాం. డిసెంబర్ చివరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం:బెజవాడ ఆనందమూర్తి.