బాగా తగ్గించేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ భామ తమన్నాకు ఈమధ్య అంతగా కలిసిరావడంలేదు. బాహుబలి-2లో నటిస్తున్న తమన్నా, ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొన్నటివరకు క్రేజీ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్‌కి బ్రేక్ వేసింది అభినేత్రి సినిమా. ఎన్నో ఆశలు పెట్టుకుని అందరినీ భయపెట్టి సక్సెస్ కొట్టాలనుకున్న తమన్నాకు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ సినిమాతో హిట్ కొట్టలేదు సరికదా.. కనీసం సరిగ్గా భయపెట్టలేకపోయింది. దాంతో ఈ సినిమా తరువాత తమన్నాకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. పైగా రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేయడంతో అందరూ వెనక్కి వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈ భామ ఇప్పుడు రెమ్యూనరేషన్‌ను బాగా తగ్గించిందట. పైగా అవకాశాలు రావటంలేదు కాబట్టే ఐటెం సాంగ్స్ చేస్తుందంటూ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఇన్నాళ్లు తమన్నా వెనక నిర్మాతలు పడేవారు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అవకాశాల కోసం ఈ అమ్మడే నిర్మాతలకు మెసేజ్ పంపిస్తోందట. ప్రస్తుతం ఈమె నటించిన బాహుబలి-2 సినిమా ఈనెల 28న విడుదల కానుంది. దాంతోపాటు హిందీలో మరో సినిమాకు కమిట్ అయింది. మరి తమన్నా రెమ్యూనరేషన్ తగ్గించింది కాబట్టి.. ఇప్పుడైనా అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి!