ఆరడుగుల బుల్లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ స్టార్ గోపీచంద్, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్రేజీ కాంబినేషన్‌లో జయబాలాజి రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార హీరోయిన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తాండ్ర రమేష్ వివరాలు తెలియజేస్తూ- గతంలో స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్లు అందించిన దర్శకుడు బి.గోపాల్ రూపొందిస్తున్న ఈ సినిమాతో గోపీచంద్ కెరీర్‌లో అదే స్ధాయి సంచలన విజయాన్ని అందుకునేలా తెరకెక్కుతున్న చిత్రమిది. ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఆరడుగుల బుల్లెట్ అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశాం. వక్కంతం వంశి అందించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, మాటలు:అబ్బూరి రవి, ఫైట్స్:కణల్ కణ్ణన్, కెమెరా:బాలమురుగన్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత:తాండ్ర రమేష్, దర్శకత్వం:బి.గోపాల్.