ఏమైంది వీళ్లకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ మంచి చిత్రాలకు ఆదరణ లేదన్న బాధే లేదు. మంచి చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ముందువరుసలో నిలుస్తారు. ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదూ అంటే.. సదరు దర్శకుడో, నిర్మాతో కథాబలం లేని చిత్రాలు పట్టుకుని పరిశ్రమకు వచ్చారనే అర్థం. ఎవరి కథ వారికి ఇష్టం. అందులో సినిమా తీయడానికి నిర్ణయించుకున్న తరువాత ఆ కథకు ఎన్ని హంగులు, రంగులద్దాలో అన్నీ జోడిస్తారు. ముఖ్యంగా రచయిత దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించడానికి కావలసిన హంగులు ఆర్భాటంగా తయారుచేస్తారు. ఈ నేపథ్యంలో సినిమా అందరికీ నచ్చేలా రూపొందితే ఓకె. లేదా ఫ్లాప్ అయిందా అందరికీ నష్టమే. నిర్మాత లాస్ అవుతాడు. ఇవన్నీ ఆలోచించేంత సమయం ఇప్పుడున్న స్పీడ్ యుగంలో దొరకడంలేదని సినీ పండితులు వ్యాఖ్యానించడం, అప్పుడప్పుడు నిజమనిపిస్తుంది కొందరి దర్శకుల తీరుతెన్నులు గమనిస్తే. ఇటీవల ముగ్గురు అగ్ర దర్శకులు తమ మూడు చిత్రాలను విడుదల చేశారు. మూడూ ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాయి. అందులో ఒకరు భారతదేశం గర్వించదగిన దర్శకరత్నం మణిరత్నం. ఆయన చెలియా పేరుతో కార్తి కథానాయకుడిగా రూపొందించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అడ్రస్ లేకుండా పోయింది. మరో దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన దూకుడును ఎవరూ ఆపలేరన్న ప్రచారం ఉండేది. కానీ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నిర్మించిన ‘మిస్టర్’ చిత్రం కూడా కనపడకుండానే వెళ్లిపోయింది. ఇక, ప్లాన్ చేయడమే తరువాయ నాన్‌స్టాప్ షూటింగ్‌తో చకచకా సినిమా పూర్తి చేసే పూరి. కొత్త కుర్రాడు ఇషాన్‌ను పరిచయం చేస్తూ చేసిన రోగ్ సినిమా అడ్రెస్ లేకుండా పోయంది. ఈ మూడు చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నా, సరైన ఆదరణ లభించకపోవడం విశేషం. ఎందుకిలా జరుగుతోంది? ఈ ముగ్గురు దర్శకులు కథలు నిర్ణయించుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారా?
గతంలో వీరు రూపొందించిన చిత్రాలను గమనిస్తే అద్భుతమైన సినిమాల రూపకర్తలుగా కనిపిస్తారు. మణిరత్నం వౌనరాగం నుండి నాయకుడు, దొంగ దొంగ, అంజలి, గీతాంజలి, పల్లవి అనుపల్లవి, రోజా, బొంబాయి, ఘర్షణ, దళపతి, ఓకె బంగారం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. మణిరత్నం అంటే అటు క్లాసికల్‌గా ఇటు మాస్ ప్రేక్షకులకూ నచ్చే విధంగా తియ్యగలడన్న పేరును సంపాదించాడు. మణిరత్నం సినిమా అంటే హీరో ఎవరు? అని చూడకుండా థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులున్నారు. అటువంటి ఆయనకు కథలు దొరకడంలేదా? లేక మంచి కథలను సరైన రీతిలో చిత్రీకరించలేకపోతున్నారా? అనేది ప్రేక్షకులకు అర్థంకాని ప్రశ్న. నాయకుడు, అంజలి, రోజా, గీతాంజలి లాంటి చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్‌లో సాగినా ఏ సినిమాకు ఆ సినిమా దృశ్యకావ్యంలా తీర్చిదిద్దిన మణిరత్నానికి ఇప్పుడు ఏమైంది? రామ్‌చరణ్ తదుపరి చిత్రం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనుందని ఓ సమాచారం. అయితే మణిరత్నం సినిమా పరాజయం చవిచూడటంతో రామ్‌చరణ్ ఈ సినిమా చేయడానికి వెనుక ముందూ ఆడుతున్నట్లు కూడా వినిపిస్తున్న సమాచారం. ఇక దూకుడు, నమో వెంకటేశాయ, ఢీ, ఆనందం, కింగ్, బాద్షా వంటి చిత్రాలను రూపొందించిన శ్రీనువైట్ల కామెడీని బేస్ చేసుకుని అద్భుతమైన కథనాలను అందించగలడన్న నమ్మకం ప్రేక్షకులకుంది. ఎటువంటి క్లిష్టతరమైన స్క్రిప్ట్‌కైనా కామెడీని అద్భుతంగా జోడించగల ఆయన ఎందుకు విఫలమవుతున్నాడు. గతంలో రూపొందించిన విధానం ఆయన చిత్రాల్లో ఎందుకు కనిపించడంలేదు అని ప్రేక్షకులు ఎంత ఆలోచించినా అర్థంకాని ప్రశ్న అవుతోంది. ఈ నేపథ్యంలో ఒకరు క్లాస్ దర్శకుడు అయితే మరొకరు మాస్ ఓరియెంటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ తీయగల సత్తా వున్నవారు. వీరిద్దరూ ఇటీవల విడుదల చేసిన చెలియా, మిస్టర్ చిత్రాలు రెండూ ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. ఇక పూరీకంటూ ఓ మార్క్ ఉంది. మాస్‌కి క్లాస్ టచ్‌నిస్తూ -క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు తీయడంలో పూరి స్టయలే వేరు. ఇడియట్, పొకిరిలాంటి చిత్రాలను పట్టిచూస్తే క్యారెక్టరైజేషన్ మీద కథను ఎంత అద్భుతంగా నడిపిస్తాడో అర్థమవుతుంది. అలాంటి స్టయల్‌లోనే రోగ్‌ని కూడా తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆడియన్స్ తిప్పికొట్టారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్న పూరి, ఎలాంటి కథతో వస్తాడోనన్న ఆసక్తి లేకపోలేదు. ఏదేమైనా ప్రేక్షకుడు తిరస్కరించాక ఆ చిత్రం గురించి మాట్లాడుకునే అవసరం లేదు. కానీ దర్శకుల ప్రతిభను బట్టి ఆలోచించాల్సి వస్తోంది.

-యు