స్పైడర్ ఆలస్యమవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించడం తెలిసిందే. సినిమా మొదలై ఎనిమిది నెలలైనా ఫస్ట్‌లుక్ విడుదల కాకపోవడంతో మహేశ్ ఫాన్స్ అసహనానికి గురయ్యారు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పడుతున్న సమయంలో ఫాన్స్ సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించారు. విషయం తెలుసుకున్న మహేశ్ అభిమానులను కూల్ చేయడమే కాకుండా హడావుడిగా ఫస్ట్‌లుక్ విడుదల చేశాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ముందుగా అనుకున్నట్టుగా చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా ఇంకా వాయిదా పడేలా కనిపిస్తోంది. దానికి కారణం సినిమాకు సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్ మిగిలిపోవడంతో అనుకున్న సమయంలో విడుదలకాదని యూనిట్‌నుండి సమాచారం. మహేష్, రకుల్ జంటను చూపించేందుకు మరికొంత టైం తీసుకుని విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. సినిమా విషయంలో కోపంగావున్న మహేశ్ ఫ్యాన్స్ ఈ వార్తను ఎలా రిసీవ్ చేసుకుంటారో.