సూర్యాభాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతిబాబు కథానాయకుడిగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమలాస్ సినిమాస్ పతాకంపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సూర్యా భాయ్’. ఈ చిత్రానికి సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తిచేశారు. చివరి షెడ్యూల్‌ను మే 5 నుండి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సినిమా మొత్తం ఈ షెడ్యూల్‌లోనే పూర్తిచేస్తామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, సూర్యాభాయ్‌గా ఓ పవర్‌ఫుల్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని తెలిపారు. పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రదీప్ రావత్, షాయాజీ షిండీ, సుమన్, సాయికుమార్, బి.ఎస్.రావు, అర్చన, రాజా రవీంద్ర, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆనంద్, నిర్మాతలు:రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం, దర్శకత్వం:అర్జున్ వాసుదేవ్.