పిశాచి భయపెట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిశాచి-2 చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను భయపెడుతోందని, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయని నిర్మాత సాయివెంకట్ అన్నారు. సినిమా బావుందన్న వౌత్‌టాక్ రోజురోజుకూ పెరుగుతుండటంతో మంచి వసూళ్లు వస్తున్నాయన్నారు. స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై ఆయన రూపొందించిన పిశాచి-2కు కలెక్షన్లు పెరిగిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను హైదరాబాద్‌లో నిర్మాత సన్మానించారు. విజయోత్సవ వేడుకలో భాగంగా అందరినీ గౌరవిస్తున్నానని, ఈ సక్సెస్‌కు కారణం వారేనన్నారు. కంటెంట్‌వున్న చిత్రాలు విజయవంతం అవుతాయని మరోసారి ఈ సినిమా నిరూపించిందని, విడుదలైన రోజునుండి సక్సెస్ టాక్‌తో సాగుతోందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. సినిమాలు వందరోజులు ఆడే రోజులు పోయాయని, ఇలాంటి తరుణంలో చిన్న సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆనందంగా ఉందని నటుడు శివాజీరాజా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆర్‌కె గౌడ్, కథానాయిక సిప్రాగౌర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.