హా..! తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి మొదటి పార్ట్ మొత్తం తమన్నా కథానాయికగా సాగింది. అవంతికగా అందాల ఆరబోతతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. దేవసేనను బంధించిన మాహిష్మతి సామ్రాజ్యంపై కత్తికడుతూనే, మహేంద్ర బాహుబలి ప్రేమమయిగా ఆమె నటన ఆకట్టుకుంది. బాహుబలి-2లోనూ తమన్నా పాత్ర బాగుంటుందని అభిమానులు ఆశించారు. విడుదలకు ముందు తమన్నా ఫస్ట్‌లుక్ కూడా విడుదల కాకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. అయితే ‘ముగింపు’ కథలోనూ తనపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని, ముఖ్యంగా యుద్ధంలో వచ్చే సన్నివేశాల కోసం తాను కష్టపడి కత్తియుద్ధాలు నేర్చుకున్నానని తమన్నా చెప్పడం గమనార్హం. అయితే తమన్నాపై చిత్రీకరించిన సన్నివేశాల నిడివి ఎక్కువ కావడంతో తొలగించారని టాలీవుడ్ సమాచారం. అసలు తమన్నాకు ఎటువంటి ప్రాధాన్యత సినిమాలో లేకపోవడం విచారకరం. ఈ సినిమా ప్రచారంలోనూ ఎక్కువగా ప్రభాస్, అనుష్క, రానా, రాజవౌళి లాంటివాళ్లే కనిపించారు. కానీ తమన్నా ఆచూకీ ఎక్కడా దొరకలేదు. దీన్నిబట్టి అవంతిక పాత్ర ఈ చిత్రంలో నామమాత్రంగా మిగిలిపోయిందన్న మాటకు రుజువు దొరుకుతోంది. తమన్నా పాత్రకు బాగా కత్తెర వేయడంతో ఆమె అలిగిందంటూ వినిపించిన కథనాలకు ఇది బలం చేకూరుస్తుంది. ‘దర్శకుడంటే తనకు గౌరవముందని, చిత్రాన్ని అతను ఎలాచేసినా తనకెలాంటి అభ్యంతరాలు లేవని పైకి చెబుతున్నా’ తమన్నాలో బాధ మాత్రం ఉందన్నది తెలుస్తోంది. ‘తన పాత్రకు రెండో పార్ట్‌లో ప్రాముఖ్యత ఉందని, క్లైమాక్స్ అంతా తనపైనే చిత్రీకరించారని’ తమన్నా చెప్పిన మాటలన్నీ నిజం కాదని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి మొదటి పార్ట్‌లో తమన్నాను హైలెట్ చేసిన దర్శకుడు, రెండో పార్ట్‌లో నామమాత్రమైన పాత్రగా మిగిల్చడం వెనుక కారణం ఏమిటో త్వరలో తెలుస్తుంది.