సరసమైనవాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై పాండీరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ రూపొందిస్తున్న చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- కెనెడాలో కంపోజ్ చేసిన ఐదు పాటలను త్వరలో విడుదల చేయనున్నామని, శింబు సోదరుడు కురళ్ అరసన్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథతో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, సాఫ్ట్‌వేర్ రంగాలలో పనిచేసే యువతీ యువకులు ప్రేమ అనే పదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చివరికి ఎలా విడిపోతున్నారు? వారి పెళ్లిళ్లు కడదాకా నిలుస్తున్నాయా అన్న కథనంతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. కథానాయికలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని, సత్యం రాజేష్ కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. మే 2న ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అదే నెల మూడవ వారంలో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత:టి.రాజేందర్, కెమెరా:బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్:ప్రవీణ్ ప్రదీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండీరాజ్.