ప్రేమకు నిర్వచనం చెప్పే శ్రీవత్స చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై సంజయ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య ప్రధాన తారాగణంగా వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడుతూ, ప్రేమన్నది ప్రపంచ వ్యాప్తంగా వున్న అందమైన అనుభవమని, ప్రేమ విషయంలో ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతూనే వుంటారని తెలిపారు. ప్రేమ అన్నది వ్యక్తిగతంగా చిన్నవిషయమైనా దాన్ని అర్థం చేసుకోవడానికి బదులు నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుంటూపోతున్నారని, దీనివల్ల మనుషులు, మానసికంగా విడిపోతున్నారని ఆయన అన్నారు. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకొని, తనవల్ల జరిగిన పొరపాటును ఎలా సరిదిద్దుకున్నాడు, తన జీవితాన్ని ఎలా అందంగా మలుచుకున్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. చక్కని ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎలాంటి వల్గారిటీ లేదని, కుటుంబమంతా కలిసి చూసేవిధంగా సాగే ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ మచిలీపట్నంలో ప్రారంభించామని, రాజమండ్రి, అమలాపురంలో షూటింగ్ చేస్తామని, మొదటి షెడ్యూల్‌లో టాకీ పూర్తిచేసి, కేరళ, కూర్గ్ ప్రాంతాలలో పాటల చిత్రీకరణ జరిపి వేసవి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. కార్యక్రమంలో బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, మోదమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.