కుర్రాళ్ల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిమీది గౌరవంతోనో, భయంతోనో వెనక్కి జరిగిన స్టార్ హీరోలంతా -సినిమాలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి’ ఏప్రిల్ మొత్తాన్ని కుదిపేయడంతో -పెద్ద హీరోలు, దర్శకులు ఈనెల మొత్తాన్ని బాహుబలికే వదిలేశారు. ఆడియన్స్‌లోనూ రాజవౌళి సినిమాపై ఎక్కువ అంచనాలు నెలకొనడంతో దానిపై పోటీగా కాని, కనీసం దగ్గరలోకానీ తమ సినిమాలు విడుదల చేసేందుకు మిగిలిన హీరోలు, పెద్ద దర్శకులు, నిర్మాతలు సాహసం చేయలేదు. బాహుబలి -ది కన్‌క్లూజన్ విడుదల తేదీ ప్రకటించడంతో, మిగతా సినిమాలన్నీ రెండువారాలు వెనక్కిపోయాయి. బాహుబలి థియేటర్లకు వచ్చేయటంతో, ఇక మిగతా హీరోలూ థియేటర్లకు వరుస కట్టేందుకు తమ సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగిలిన సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోడానికి ఎవరెవరు ఎలా రెడీ అవుతున్నారో, మే నెలలో వస్తున్న సినిమాలపై ఓ లుక్కేస్తే..
బాహుబలి థియేటర్లలో ఉంటుండగానే -్ధర్యంగా థియేటర్లకు వస్తున్నాడు బాబు.. అవసరాల శ్రీనివాస్. ‘బాబు బాగా బిజి’ పేరిట రూపొందిన సినిమాపై ఇప్పటికే అంచనాలు లేకపోలేదు. బాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అవసరాల భిన్నమైన పాత్ర చేస్తుండడం విశేషం. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా బాహుబలి కోసం వాయిదావేశారు. ఇప్పుడు బాహుబలి విడుదలైపోయింది కనుక మే 5నే చిత్రాన్ని థియేటర్లకు తెచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ‘ఎ’ గ్రేడ్ మసాలాతో ట్రైలర్‌లోనే దుమ్మురేపిన ఈ చిత్రం ఎలాంటి విజయం అందుకుంటుందన్న ఆసక్తి కనిపిస్తోంది.
ఇక సమ్మర్ లైనులో నిలిచిన మరో యువ హీరో నాగచైతన్య. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాపైనా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. తరువాత విడుదలకు సిద్ధమైన కుర్ర హీరో నిఖిల్. ఆమధ్య ‘స్వామి రారా’తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న సుధీర్‌వర్మ దర్శకత్వంలో నిఖిల్ చేసిన చిత్రం ‘కేశవ’. ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నారు. మరో యువ హీరో శర్వానంద్ కూడా స్పీడ్ పెంచాడు. తాజాగా శర్వా చేసిన ‘రాధ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి టాక్ తెచ్చుకోవడంతో సమ్మర్ బరిలో దించేందుకు సిద్ధమయ్యారు దర్శక నిర్మాతలు. మొత్తానికి బాహుబలి తరువాత విడుదలవుతున్న నాలుగు చిత్రాలు యువ హీరోలవి కావడం విశేషం. సమ్మర్ రేసులో ఏవరు ముందుంటారో చూడాలి.

-శ్రీ