రక్షకభటుడు ఎవడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుఖీభవ మూవీస్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ గురురాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రక్షకభటుడు’. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కథానాయకుడు ఎవరనేది ఇప్పటివరకూ సస్పెన్స్‌గానే ఉంచిన ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయికగా నటిస్తోంది. మే ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో నిర్మాత ఎ గురురాజ్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైనప్పటినుంచి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. అసలు ఆంజనేయస్వామి గెటప్‌లో, పోలీసు డ్రెస్‌లో కనిపిస్తున్న హీరో ఎవరని అందరూ అడుగుతున్నారు. అలాగే థియేటర్ ట్రైలర్‌కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర సారథ్యంలో వచ్చిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. అరకులోయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? అసలు ఆంజనేయస్వామికి రక్షకభటుడు అనే టైటిల్‌కు ఉన్న సంబంధమేమిటి? అనే అంశంతో దర్శకుడు చిత్రాన్ని ఎమోషన్ కామెడీ, థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో చిత్రీకరించారు అని తెలిపారు. తొలి సన్నివేశం నుంచి చివరివరకూ ఎంటర్‌టైనింగ్‌గా సాగే చిత్రంలో చివరి 15 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, సెన్సార్ వారు యు/ఎ సర్ట్ఫికెట్ అందించారని, మే తొలివారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని చెప్పారు.
బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్, ధన్‌రాజ్, నందు, చిత్రమ్ శ్రీను, సత్తెన్న, జ్యోతి, మధు తదితరులు నటించిన చిత్రానికి కెమెరా మల్హర్ భట్ జోషి, ఎడిటింగ్ అమర్‌రెడ్డి, రచన, దర్శకత్వం వంశీకృష్ణ ఆకెళ్ల.