19న కేశవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, రీతూవర్మ, ఇషాకొప్పికర్ ప్రధాన తారాగణంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కేశవ’. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా మే 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. స్వామిరారా తరహాలో సినిమా విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సుధీర్‌వర్మ, నిఖిల్ కాంబినేషన్‌లో రూపొందటంతో అంచనాలు భారీగా పెరిగాయని, మే 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అన్నారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే కథనాన్ని సరికొత్త ఫార్మాట్‌లో తెరకెక్కించామని, హీరోయిన్ల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు నటించిన చిత్రానికి కెమెరా దివాకర్ మణి, సంగీతం సన్నీ ఎంఆర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సుధీర్ వర్మ.