రవితేజను టచ్ చేస్తే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా గ్యాప్ తరువాత రవితేజ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ప పతాకంపై విక్రం సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేన వంశి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రాన్ని పాండిచ్చేరిలో చిత్రీకరించారు. రవితేజ ఇమేజ్‌కు తగిన విధంగా వక్కంతం వంశి రూపొందించిన ఈ కథతో రవితేజ పూర్వవైభవాన్ని పొందుతారని యూనిట్ చెబుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో వైవిధ్యమైన కథ, కథనాలు హైలెట్‌గా వుంటాయని చెబుతున్నారు. పీటర్ హేన్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు కెమెరా ఎం.సుకుమార్ అందిస్తున్నారు. ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల హృదయాలకు రవితేజ హీరోయిజాన్ని టచ్ చేస్తుందేమో చూడాలి!