మా విరాళం రూ.5 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై వరదబాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కళలకు, కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిన నడిగర్ ఎన్నికల్లో విశాల్ గెలిచాడని తెలిపారు. ఎన్నో మంచి పనులకు స్వీకారం చుడుతున్న అతనికి చెన్నైలో వచ్చిన వరదల కారణంగా ఎందరో కనీస వసతులు లేకుండా వున్న పరిస్థితులలో ‘మా’ తరఫున సహాయం చేస్తున్నామని తెలిపారు. టాలీవుడ్ నుండి పవన్‌కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్‌లాంటి స్టార్లు ముందుకు వచ్చి తమ సహాయం అందించారని, అదే సమయంలోనే మా అసోసియేషన్ తరఫున 5 లక్షల విరాళాన్ని ప్రకటించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు డ్రామా ఆర్టిస్టులకు సీనియర్ కళాకారులకు పెన్షన్లు అందజేస్తున్నారని, అదే పని మా సంఘం కూడా చేయనుందని తెలిపారు. వరద బాధితుల కోసం హైదరాబాద్, బెంగుళూరు, కేరళ వంటి ప్రాంతాలనుండి ఎవరికి తోచినంత వారు సహాయాన్ని అందించారని, చెన్నైలోని కడలూరు ప్రాంతంలో వుండడానికి చోటులేని పరిస్థితి నెలకొందని, అక్కడ మళ్లీ ఇళ్లను కట్టించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.