12న రాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు రూపొందిస్తున్న చిత్రం ‘రాధ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 12న చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం త్వరలోనే నిర్వహిస్తామని, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటూ క్లాస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. శర్వానంద్‌పై మిలన్‌లో ఒక పాట చిత్రీకరించామని, దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. చిత్రానికి సంగీతం రధన్, కెమెరా కార్తీక్ ఘట్టమనేని, దర్శకత్వం చంద్రమోహన్.