మరో 150 థియేటర్లలో సోగ్గాడే చిన్నినాయన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నిర్మించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ఈ సినిమా పండుగకు విడుదలైన సినిమాల్లో అగ్రగామిగా నిలిచింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. 450 స్క్రీన్స్‌పై విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 22నుండి మరో 150 స్క్రీన్స్ పెంచి 600 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
నైజాంలో కేవలం 120 థియేటర్లలోనే విడుదలై 6 రోజుల్లోనే 5కోట్ల 20 లక్షలకు పైగా షేర్ సాధించింది. ఇప్పుడు మరో 55 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించనున్నట్లు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ సునీల్ చెప్పారు. ఫస్ట్‌వీక్‌లో తక్కువ స్క్రీన్స్‌లోనే రికార్డ్ షేర్స్ సాధించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సెకండ్ వీక్‌లో ఇంకా పెద్ద రేంజ్‌కు వెడుతుందని, ‘సంక్రాంతికి వస్తాం... సూపర్‌హిట్ కొడతాం’ అని ఆడియో ఫంక్షన్‌లో అభిమానులతో చెప్పినట్టుగానే చెప్పి మరీ రికార్డ్‌బ్రేకింగ్ హిట్ నాగార్జున ఇచ్చారని ఆయన అన్నారు. కాగా ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్‌లో ఫస్ట్‌వీక్‌లోనే 29 లక్షల 37వేలు గ్రాస్ కలెక్ట్‌చేసి సింగిల్ థియేటర్ రికార్డ్ సృష్టించింది.