‘సాహో’ అంటున్న తమ్మూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి ఇమేజ్ ‘బిగినింగ్’లో దొరికినంతగా ‘కన్‌క్లూజన్’లో దొరకకపోయినా -తమ్మూ బేబీకి అంతకంటే మంచి చానే్స దక్కేలావుంది. శివుడితో ప్రణయ కలాపాలు సాగించే చాన్స్ ‘కన్‌క్లూజన్’లో తమ్మూకి రాజవౌళి ఇవ్వలేదు. ఆమె పాత్రను చాలా పరిమితం చేసేశారు. ఆ బాధలోవున్న తమన్నాకి ఓదార్పు కలిగించేలాంటి చాన్స్ మళ్లీ ప్రభాస్‌తోనే దక్కనుంది. బాహుబలి ఇమేజ్ గ్రాఫ్‌కు ఏమాత్రం తగ్గకుండా మరో భారీ ప్రాజెక్టు చేస్తున్న ప్రభాస్‌తో ‘సాహో’లో జోడీ కట్టే చాన్స్ తమన్నాకు దక్కిందని అంటున్నారు. అంటే ప్రభాస్ సరసన తమ్మూకి ఇది మూడో సినిమా అవుతుంది. అటు రెబెల్, ఇటు బాహుబలి రెండు ప్రాజెక్టుల్లో అందాలతో మెరిపించిన తమన్నా -ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాహోలోనో చాన్స్ దక్కిందట. భారీ బడ్జెట్‌తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్టులో ప్రభాస్‌కు జోడీగా ముందు రష్మిక మండెల్‌ను అనుకున్నా, అటు తిరిగి ఇటు తిరిగి చాన్స్ తమన్నాకే వచ్చిందని అంటున్నారు.
ఇప్పటి వరకూ గ్లామర్‌కే పరిమితమైపోయిన తమన్నా -వైవిధ్యమైన పాత్రలూ చేస్తానంటూ కొంతకాలంగా చెప్తూ వస్తోంది. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లోనే కనిపించాలంటే మహా బోర్. అందుకే అప్పుడప్పుడూ కాస్త పక్కకు జరిగి, వైవిధ్యమైన పాత్రలు చేస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. లేటెస్టుగా విక్రమ్‌తో జోడీకట్టి కెరీర్‌కు సక్సెస్ ‘స్కెచ్’ గీస్తున్న తమ్మూ, ఈ చిత్రంలో కాస్త వైవిధ్యంగా కనిపిస్తానంటోంది. తమన్నా పాత్ర ఆసాంతం కొత్తగా ఉంటుందని యూనిట్ సైతం నమ్మకంగానే చెబుతోంది. విక్రమ్ మాస్ లుక్కుకు కాంట్రాస్ట్‌గా తమ్మూ బ్యూటీని మేకోవర్ చేస్తున్నారని అంటున్నారు. చిత్రంలో విక్రమ్ చింపిరి జుత్తు, గడ్డం, గళ్ల లుంగీ లుక్‌లో సైకిల్‌మీద తిరుగుతూ కనిపిస్తాడట. మాస్ లుక్కులో హీరో కొత్తగా కనిపించినట్టే క్లాసిక్ లుక్కులో తానూ వైవిధ్యంగా కనిపిస్తానని అంటోంది తమ్మూ బేబీ. అన్నట్టు ఈ సినిమాలో తమ్ము ఎలాంటి పాత్ర చేస్తుందో తెలుసా. బ్రాహ్మణ యువతిగా మడిగట్టుకున్న సంప్రదాయ పాత్ర చేస్తోందట. విక్రమ్ క్యారెక్టర్‌కు కాంట్రాస్ట్‌గా తన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని కూడా అంటోంది ప్రస్తుతం కెరీర్ కాస్త నెమ్మదించటంతో, మళ్లీ ఊపందుకునేందుకు జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటోంది తమ్మూ. రెగ్యులర్ పాత్రలకంటే భిన్నమైన పాత్రలు చేయాలన్న ఊపుతో కనిపిస్తోంది కూడా.