భయపెట్టే వేటపాలెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీ, ప్రణీ ఫిలింస్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎ.వి.ఆర్. మాట్లాడుతూ- సందేశంతో కూడిన కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం అందరికీ ఆకట్టుకునే విధంగా వుంటుందని, పాత్రలు భయపెడుతూ సాగుతాయని, ఓ మంచి చిత్రాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనాథ పిల్లలకు సరైన శిక్షణ లేకపోవడంతో వాళ్లు సంఘానికి శత్రువులుగా మారుతున్నారని, వారు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారన్న నేపథ్యంలో క్రైమ్ అంశాలతో మనసును తాకే ఈ విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:డి.యాదగిరి, సంగీతం:ఎం.ఆర్.సన్ని, పాటలు:నర్ల రామకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నంది వెంకటరెడ్డి.