లజ్జ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై మధుమిత, శివ, వరుణ్ ప్రధాన తారాగణంగా నరసింహ నంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘లజ్జ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బి.గోపాల్, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ, రొమాంటిక్ మూవీగా ఈ చిత్రాన్ని తీశామని, ప్రతి అమ్మాయి పెళ్లయిన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని కలలు కంటుందని, భర్తను దగ్గరనుంచి ప్రేమను పొందలేకపోయినా, తన మనసుకు అతను దగ్గరగా లేకపోయినా, తన ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయినా ఆ అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. మనసుకు నచ్చిన వ్యక్తికోసం ఎంతదూరమైనా వెళ్లగలిగే పాత్రలో మధుమిత చక్కగా నటించిందని, ఇప్పటివరకు ఆర్ట్ తరహా చిత్రాలనే తాను తెరకెక్కించానని, ఇపుడు తొలిసారిగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించానని ఆయన తెలిపారు. సెన్సార్ వారు మెచ్చుకున్న ఈ చిత్రంలో సమాజంలో వున్న సమస్యలను సినిమాగా తెరకెక్కించి మార్పుకోసం ప్రయత్నించామని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో వనమాలి, ఆర్.పి.పట్నాయక్, సుక్కు, శివ, మహంతి, రతి, పి.ఎల్.కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.