సంపూ కొబ్బరిమట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణేష్‌బాబు హీరో, షకీల, గాయత్రి కీలక పాత్రల్లో నటించిన అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజనా మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా కొబ్బరిమట్ట. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈసినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈసందర్భంగా మే 9న హీరో సంపూర్ణేష్‌బాబు పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ మాట్లాడుతూ- ఈ సినిమాకు మొదటినుండి ప్రేక్షకుల ఆదరణ దొరికిందని, అందువల్ల సినిమాను అద్భుతంగా పూర్తిచేశామని, పాపారాయుడు, పెద పాపారాయుడు, ఆండ్రాయిడు పాత్రల్లో సంపు వైవిధ్యంగా నటించాడని, అందరికీ థ్రిల్ కలిగే ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. హృదయకాలేయం సినిమాతో చిన్న నటుణ్ణి అయినా సరే అన్ని దిక్కులనుండి గుర్తింపు తనకు వచ్చిందని, ఎంతోమంది సినిమా పెద్దలు ఆశీర్వదించి అవకాశాలు కల్పించారని సంపూర్ణేష్‌బాబు తెలిపారు. హృదయకాలేయం నుండి తనకు ప్రతిరోజు పండుగలా వుందని ఆ సినిమా విడుదల తరువాత లభించిన గుర్తింపు ఆనందాన్నిస్తోందని, హృదయకాలేయం సినిమాను ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారో, ఈ చిత్రాన్ని అలాగే ఆనందిస్తారని ఆయన చెప్పారు. కొబ్బరిమట్టలో ఎటువంటి స్ఫూఫ్‌లు లేవని, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, ఏడుగురు భార్యలు, పది పనె్నండుమంది పిల్లలు, 30, 40 మంది మనవళ్ళు మనవరాళ్ళతో ఈ చిత్రంలో పెద్ద కుటుంబం వుంటుందని, టీజర్‌కు, పాటకు మంచి స్పందన లభిస్తోందని, సోలో హీరోగా రెండు సినిమాలు ప్రారంభం అవుతాయని, కారెక్టర్ ఆర్టిస్టుగా ఏ సినిమాలోనూ చేయడంలేదని ఆయన వివరించారు.