వినోదం 100% గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ భరత్, అశ్విని, కాంచన, పృధ్విరాజ్ ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్.సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పోట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన ‘వినోదం వంద %’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, కిషోర్ రాఠి, అచ్చిరెడ్డి సంయుక్తంగా బిగ్ సీడీని విడుదల చేయగా, పృధ్వీరాజ్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జైశ్రీరామ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా రూపొందిన ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి ఎఫర్ట్‌ను పెట్టి పనిచేశారని, ప్రతి సన్నివేశంలో నవ్వులు విరబూస్తూనే వుంటాయని ఆయన తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ శాతం బ్యాంకాక్ షూటింగ్ చేసిన ఈ చిత్రంలో కమెడియన్ల మధ్య జరిగే ప్రతి సన్నివేశం కథలోనే సాగుతూ స్టోరీకి అనుబంధంగా వుంటుందని, అందుకే ఈ చిత్రానికి ఆ పేరు పెట్టామని నిర్మాత శ్రీనివాసరావు తెలిపారు. ఈ చిత్రంలో పాటలు అందరికీ నచ్చుతాయనే నమ్మకం వుందని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. కార్యక్రమంలో సాయివెంకట్, శోభారాణి, గురవ నరసయ్య, రవికుమార్, లక్ష్మారెడ్డి, అచ్చిరెడ్డి, ఉత్తేజ్, హీరో విజయ్‌భరత్, అశ్విని, సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంపూ, సత్యం రాజేష్, పోసాని, జీవ, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సుభాష్ ఆనంద్, కెమెరా:మల్లికార్జున్, మాటలు:అంజన్, రచన:జయకుమార్, పాటలు:చిర్రావూరి విజయకుమార్, కృష్ణచిన్ని, చంద్ర కాటుబోయిన, నిర్మాత:పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జైశ్రీరామ్.