హిందీ రీమేక్‌లో వెంకటేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురు సినిమాతో వైవిధ్యమైన పాత్రలకు, కథలకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరో ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బి-2 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ అంశంపై వెంకటేష్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రిప్ట్ రాస్తారని, అలాగే సినిమా డిసెంబర్ నుండి మొదలవుతుందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమటుకు వాస్తవముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ ఎస్.రాధాకృష్ణన్ నిర్మించనున్నారు.