బాలయ్యతో భారీ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచరీ దాటడంతో బాలకృష్ణ స్పీడ్ పెంచుతున్నాడు. బాలకృష్ణ హీరోగా సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో సి కల్యాణ్ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య 102వ సినిమాగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రజనీకాంత్‌తో నరసింహవంటి భారీ హిట్ అందించిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయడం తొలిసారి. నిర్మాత సి కల్యాణ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఎం రత్నం అందించిన వైవిధ్యమైన కథ నచ్చడంతో చిత్రాన్ని ప్రారంభిస్తున్నామని, మాటలు కూడా రత్నం అందిస్తున్నారన్నారు. బాలకృష్ణ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాగా రూపొంది సంచలన చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నెలాఖరుకు సినిమా ప్రారంభించి, జూలై 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు వివరించారు. అయితే, చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని కల్యాణ్ వివరించారు.
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో చారిత్రాత్మక విజయం సాధించిన బాలకృష్ణ, 102వ చిత్రంగా చేస్తున్న సినిమా కూడా అంతే ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని కల్యాణ్ వివరించారు.