సెన్సార్‌లో సినీమహల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్వి ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందిస్తున్న చిత్రం ‘సినీ మహల్’ (రోజుకు 4 ఆటలు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కొత్త తరహాగా సాగే కథ కథనాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, సలోని చేసిన ప్రత్యేక గీతం హైలెట్‌గా వుంటుందని, ఆ పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరినెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. గొల్లపూడి, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా:దొరై కె.సి.వెంకట్, సంగీతం:శేఖర్ చంద్ర, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, పాటలు: సుద్దాల, కృష్ణచైతన్య, నాగ హనుమాన్, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.