సావిత్రిలో భానుప్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో సీనియర్ నాయిక భానుప్రియ ఓ కీలకమైన పాత్రలో నటించనున్నారట. ఏ పాత్రలో ఆమె నటించనున్నదో మాత్రం సస్పెన్స్ అని దర్శకుడు నాగ అశ్విన్ తెలియజేశారు. స్వప్న సినిమా పతాకంపై తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిచూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలకమైన పాత్రలో కన్పిస్తారట. ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు పాటలను రికార్డ్ చేశారు.