వేడుక చూద్దాం రారండోయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఈనెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వినిపిస్తోందని, ఈ థియేటర్ ట్రైలర్‌కు అద్భుతమైన క్లిక్స్ వచ్చాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు హైలెట్‌గా వుంటుందని, జగపతిబాబు, సంపత్‌ల పాత్రలు వైవిధ్యంగా వుంటాయన్నారు.