కాస్త రొమాంటిక్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, మేఘా అక్ష, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ ఇదివరకే హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కొన్ని రోజులుగా వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్ కూడా పూరె్తైంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్ ఈనెల 26నుంచి మొదలవుతుంది. చివరి షెడ్యూల్‌ను మళ్లీ వైజాగ్‌లో జరపనున్నాం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే చిత్రాన్ని దర్శకుడు కిశోర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. నేను శైలజతో రామ్ కెరీర్‌కు మంచి విజయాన్ని అందించిన కిశోర్, ఈ సినిమాతో మరో హిట్ ఇస్తాడన్న నమ్మకం ఉంది. ఇందులో రామ్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.