తెలుగింటి ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజాతా ఆర్ట్స్ పతాకంపై గగన, సిద్ధార్థ్ జంటగా అరుంధతి శ్రీను దర్శకత్వంలో బెజవాడ నాగేశ్వర రావు నిర్మిస్తోన్న చిత్రం ‘అమరావతి అమ్మాయి’. అచ్చమైన తెలుగింటి ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ చిత్రం 26నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆద్యంతం అమరావతి పరిసరాల్లోనే షూటింగ్ జరుపుతామని, తెలుగుదనం ఉట్టిపడే ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధాని అయిన తరువాత, షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదే కావడం ఆనందంగా ఉందని నిర్మాత వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో అన్నిరకాల కమర్షియల్ హంగులు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి మాటలు శరత్, పాటలు భాగ్యలక్ష్మి, సంగీతం అభిరామ్, కెమెరా రాజు.