మగాళ్లు చూడాల్సిన పడేసావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు కార్తీక్, నిత్యాశెట్టి, శామ్ ప్రధానంగా చునియా దర్శకత్వంలో ఐయాన్ క్రియేషన్స్ పతాకంపై నాగార్జున ప్రోత్సాహంతో రూపొందించిన చిత్రం ‘పడేసావె’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ హైదరాబాద్‌లో అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తాను చూశానని, ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ముఖ్యంగా మగవాళ్ళు చూడాల్సిన సినిమా అని తెలిపారు. ఆడవాళ్ళు వారి భర్త, బాయ్‌ఫ్రెండ్స్ ఎలా వుండాలో ఆలోచించే ఓ చిత్రమని, సినిమా చూడగానే ఆ దర్శకురాలి ప్రతిభపై నమ్మకం కలిగిందని తెలిపారు. పాటల పిక్చరైజేషన్ బాగుందని, ఈ ఆల్బంలో అన్ని పాటలు హిట్ అవుతాయని ఆయన అన్నారు. ఈ సినిమా విజయవంతం అవడం ఖాయమని కె.రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. అందరూ కొత్త నటీనటులు, టెక్నీషియన్లను కనిపిస్తున్న ఈ యూనిట్‌లో చునియా మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న నాగార్జునను అభినందిస్తున్నానని నటుడు ప్రకాష్‌రాజ్ తెలిపారు.
కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎ.నాగసుశీల, బి.జయ, బి.గోపాల్, శామ్ కె.నాయుడు, కళ్యాణకృష్ణ, లావణ్యత్రిపాఠి, ఎస్.గోపాల్‌రెడ్డి, సుశాంత్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్ర హీరోహీరోయిన్లు పాల్గొన్నారు.