పాటల్లో కేశవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, రీతువర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం కేశవ. చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. టి న్యూస్ ఎండి సంతోష్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుణశేఖర్, శర్వానంద్, సి కల్యాణ్, సుధాకరరెడ్డి, వెనె్నల కిశోర్, కృష్ట చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ అభిషేక్‌కు సినిమా అంటే పిచ్చి. తను ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడని ముందే చెప్పాను. సుధీర్ నిఖిల్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సంచలన విజయం సాధించాలని అన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ సన్ని మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ట్రెడిషనల్ మ్యూజిక్‌తో నేటి తరానికి నచ్చేలా పాటలు అందించాడు. సుధీర్ ‘స్వామి రారా’ సినిమాతో దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు అన్నారు. కథని బాగా ప్రెజెంట్ చేయగల దర్శకుడి ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా ఎప్పుడు చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. అభిషేక్ డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా నిర్మాతగానూ ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ కథ బాగా నచ్చడంతో నిఖిల్, అభిషేక్‌లు సినిమా కోసం టెన్షన్ పడ్డారు. దివాకర్, సన్ని, ప్రశాంత్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో చూపించారు. నిఖిల్ అనుకున్నదానికంటే అద్భుతంగా పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. రీతూ, ఇషా కొప్పికర్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. హీరో నిఖిల్ మాట్లడుతూ భిన్నమైన సినిమా చేసేటప్పుడు మనకు సపోర్టు చాలా అవసరం. ఆ సపోర్టే నాకు ప్రేక్షకులతోపాటు చందూ, సుధీర్, చైతూలు అందించారు. అభిషేక్ నాకు పెద్దన్నలాంటివాడు. ఆయన వంద సినిమాలు తీసిన నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత మాట్లాడుతూ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నామని అన్నారు.