రీమేక్ రాయుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక భాషలో హిట్టయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇదివరకే చాలా సినిమాలు చాలా భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా. పెద్ద హీరోలు ఇప్పుడు రీమక్‌లే సేఫ్ అని ఫీలవుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మరో రీమేక్ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రస్తుతం ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత, ఆయన తన తరువాతి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హిందీలో విడుదలై మంచి విజయం సాధించిన జాలీ ఎల్‌ఎల్‌బి చిత్రానికి రీమేక్‌గా రూపొందనుందట. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో తెరకెక్కింది. పవన్ కల్యాణ్‌కు సామాజిక అంశాలంటే ఆసక్తి కాబట్టి ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడట. ఇందులో లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం కూడా తమిళ చిత్రానికి రీమేక్. కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలను ఎంచుకుంటున్న పవన్ కల్యాణ్ ఖుషీ, గోపాల గోపాల వంటి రీమేక్ చిత్రాలనూ చేశాడు. త్వరలోనే జాలీ ఎల్‌ఎల్‌బికి సంబంధించిన వివరాలు వెలువడనున్నాయి.