రాధ వైవిధ్యమైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధ చిత్రం కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని, ఈ వేసవికి విడుదలైన చిత్రం అందరికీ ఎక్కడలేని ఆనందాన్ని అందిస్తోందని దర్శకుడు చంద్రమోహన్ అన్నారు. మహిళా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శర్వానంద్ హీరోగా బివిఎస్‌ఎన్ ప్రసాద్ రూపొందించిన రాధ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక నిర్వహించారు. నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ అందించిన చిత్రానికి విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసు పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచిందన్నారు. రాధకు కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించటం ఆనందంగా ఉందని, అందరూ రెగ్యులర్ చిత్రమే అంటున్నా తన కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని హీరో శర్వానంద్ అన్నారు. ప్రతి పాత్రకు విశిష్టమైన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హాస్యనటుడు సప్తగిరి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.