గాసిప్స్ లెక్కచేయను.. హన్సిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ హన్సిక. అటుపై తమిళ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం రెండు భాషల్లో నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈమె నటించిన ‘అరన్మణి’ (చంద్రకళ) చిత్రం సంచలన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌గా ‘అరన్మణి-2’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో కళావతి పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించాడు. త్రిష, సిద్ధార్థ్, పూనమ్ బజ్వా తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదల కానున్న సందర్భంగా హన్సికతో ఇంటర్వ్యూ..
బాగా నచ్చిన పాత్ర
‘అరన్మణి’ మొదటి భాగంలో నటించమని అవకాశమొచ్చినపుడు ఈ పాత్రలో నటించగలనా అని అనుకున్నాను. కథ బాగా నచ్చింది. ముఖ్యంగా పల్లెటూరి అమ్మాయి పాత్ర అవడంతో కొత్తగా వుంటుందని చేశా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కళావతి’ దానికి రెండింతలు వుంటుంది.
గర్భవతి పాత్రలో..
ఈ సినిమాలో నేను గర్భవతిగా కనిపిస్తాను. మొదటిసారి ఈ తరహా పాత్రలో చేస్తున్నాను. సుందర్ చాలా ప్రాక్టీసు ఇచ్చారు గర్భవతి ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి వంటి విషయాలపై. సినిమా చూసిన తరువాత బాగా నటించావని అందరూ అనడం ఆనందం కలిగించింది.
త్రిషతో గొడవల్లేవు
చంద్రకళ సినిమాకు సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమాలో నేను, దర్శకుడు సుందర్ తప్ప అందరూ కొత్తవారే. ఈ సినిమాలో నాతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. పూనమ్ బజ్వాకి నాకు మధ్య సన్నివేశాలు ఏమీ లేవు. అలాగే త్రిషకు నాకు మధ్య గొడవలవుతున్నాయని బయట ప్రచారం జరుగుతోంది. అలాంటిదేంలేదు. తనతో నాకు ఎప్పటినుంచో మంచి పరిచయం వుంది.
మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి
తమిళంలో వచ్చే కథలు బాగా నచ్చుతున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. కథ నచ్చితే ఎక్కడైనా చేస్తా. ప్రస్తుతం తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేయాలనుంది.
హారర్ అంటే భయం
చాలా గ్యాప్ తరువాత నేను నటించిన హారర్ సినిమా చంద్రకళ. హర్రర్ సినిమా చూడాలంటే నాకు చాలా భయం. కానీ నటిస్తా.
గాసిప్స్
లెక్కచేయను
నేను గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే అందులో నిజం వుండదు కదా. అలాగే నా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు వస్తే మాత్రం నచ్చదు.
ఖాళీ సమయాల్లో
షూటింగ్ లేనప్పుడు ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేస్తాను. ఈమధ్యే మా అమ్మకోసం ఆరు అడుగుల గురునానక్ పెయింటింగ్ వేశాను. దాంతో మరో చిన్న పెయింటింగ్ కూడా వేశా.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.

-శ్రీ