రానా ఫ్రమ్ సిబిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ప్రధాని మర్డర్ కేసును రానా చేధించనున్నాడా? అంటే అవుననే అంటోంది ఇండస్ట్రీ. హీరో రానాకు మాజీ ప్రధాని మర్డర్ కేసుకు సంబంధమేమిటనే ప్రశ్న వేయక్కర్లేదు. ఎందుకంటే -రాజీవ్ మర్డర్ కేసు బ్యాక్‌గ్రౌండ్‌తో నిర్మించబోయే చిత్రంలో రానా సిబిఐ అధికారి పాత్ర పోషించబోతున్నాడన్న న్యూస్ సెనే్సషన్ అవుతోంది. బహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా, ఇప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో హీరో పాత్ర చేస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఎఎంఆర్ రమేష్ ఈ చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. హత్య కేసును చేధించే సిబిఐ అధికారి పాత్రను రానా పోషించనున్నట్టు సమాచారం. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తారట. రాజీవ్ గాంధీ హత్య కేసులో జరిగిన ఇనె్వస్టిగేషన్ పార్ట్‌పైనే చిత్రంలో ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. హిందీ నటుడు రవి కాలే కూడా సినిమాలో నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.