పవన్ అకౌంట్ హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పవన్ ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను దొంగిలించిన హ్యాకర్లు, ఆ తర్వాత పవన్ తన ఖాతాను యాక్సిస్ చేయలేని విధంగా చేశారు. మొదట ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని అనుకొన్నా, తర్వాత అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన వెంటనే తన స్ట్ఫాను అలెర్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ సిబ్బంది ట్విట్టర్ సిబ్బందితో సంప్రదింపులు జరిపి అకౌంట్‌ను రిస్టోర్ చేసే పనిలో ఉన్నారు. పవన్‌కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు, నిర్ణయాలను ట్విట్టర్ ద్వారానే అభిమానులతో, ప్రజలతో పంచుకుంటుంటారు. అలాంటి ముఖ్యమైన అకౌంట్ హ్యాక్ చేసినవారు దుర్వినియోగానికి పాల్పడతారేమోనని అభిమానులు కంగారులో ఉన్నారు. ఇప్పటికే పవన్ ఆఫీస్‌నుండి కూడా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.