మరణం తర్వాత జీవితం!-హరినాథ్ పొలిచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిహెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన హారర్, ఫన్, లవ్ కానె్సప్ట్ సినిమా ‘టిక్ టాక్’. సినిమాకు హీరో, దర్శక నిర్మాత అయిన హరినాథ్ పొలిచర్ల మీడియాకు చెప్పిన విశేషాలు.
మానసిక తృప్తికి..
అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి వారాంతం డాన్స్ క్లాసులకు వెళ్ళేవాడిని. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ నిర్వహించే వేడుకల కోసం రెండు మూడుసార్లు నృత్య కావ్యాలు చేశాను. అందుకోసమని కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నా. డాక్టర్ వృత్తిలో మంచిగా సంపాదిస్తున్నారు, మళ్లీ సినిమాలెందుకు? అని చాలామంది అడుగుతున్నారు. సినిమా అనేది నాకు ఆత్మ సంతృప్తి.
చిన్నప్పటినుంచే..
చిన్నప్పుడు హైస్కూల్లో నాటికలు వేసేవాళ్లం. అలా బాల్యం నుంచే నటనతో అనుబంధం ఉంది. మెడిసిన్ చేస్తున్న రోజుల్లో తెదేపా ఎంపీ శివప్రసాద్ నాకు గురువు. ఆయనతో కలిసి అప్పటినుండే నాటకాలు వేసేవాడిని. చదువు తర్వాత సినిమాల్లోకి వస్తానన్నపుడు, అమ్మా నాన్న ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. దాంతో వెనక్కి తగ్గా. న్యూరాలజిస్ట్‌గా పదేళ్ల వైద్యసేవ తరువాత.. ఇంతేనా జీవితం? అన్న ఆలోచనతో ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.
కన్నడం నుంచి..
కన్నడంలోనే తొలి సినిమా చేశా. తెలుగు భాషపై అభిమానంతో ఇక్కడి ఇండస్ట్రీకి వచ్చా. తెలుగులో ముందుగా ప్రేమాయనమః సినిమా చేశాను.
టిక్ టాక్ గురించి..
టైటిల్లో టిక్ అంటే మనిషి బ్రతికున్నప్పటి జీవితం. టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళ్తాడు, ఆత్మ అవుతాడు అని పలు రకాలుగా చెప్పుకుంటాం. కానీ, మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమా ఇది. హారర్ కంటెంట్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంతకుమించిన ఫన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్‌తో సాగే సినిమా. ఇందులో నాదొక మెకానిక్. ఫన్‌తో కూడిన మాస్ క్యారెక్టర్.
కొత్తవారితో..
మంచి కథతో ఎవరైనా ముందుకొస్తే తప్పకుండా అవకాశమిస్తా. నా సినిమాలను గమనిస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది.

-శ్రీ