దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండుపాళ్యం చిత్రంతో దర్శకుడు శ్రీనివాసరాజు పొందిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ఆ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని సీక్వెల్‌గా రూపొందించారు. వెంకట మూవీస్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం గురించి నిర్మాత వెంకట్ మాట్లాడుతూ తెలుగు, కన్నడ భాషల్లో సూపర్‌హిట్ అయిన దండుపాళ్యం చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మొదటి చిత్రంలాగే ఈ సినిమాలో కథ, కథనాలు రియలిస్టిక్‌గా ఉంటాయని, సినిమా మొదటినుండి చివరివరకూ ప్రతి సన్నివేశం గ్రిప్పింగ్‌గా ఉంటుందని, డిఫరెంట్ సినిమాలు ఆదరించే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని తెలిపారు. చిత్రానికి కెమెరా వెంకట్ ప్రసాద్, సంగీతం అర్జున్ జన్య, నిర్మాణం వెంకట్ మూవీస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శ్రీనివాసరాజు.