ఇదో ప్రేమికుల క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీష్‌చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి రూపొందించిన చిత్రం ‘లవర్స్ క్లబ్’. పక్కా యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందిన సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్తవారైనా మెచ్యూరిటీతో నటించారని, దర్శకుడు వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించారన్నారు. ఈనెల 22న టీజర్‌ను, జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రేమికులకు అండగా నిలబడే ఓ యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో చిత్రం తెరకెక్కించినట్టు ధృవశేఖర్ తెలిపారు. యధార్థ సంఘటనలతో చిత్రం తీశామని, వినోదాత్మక, ఎమోషనల్ సన్నివేశాలను అనుగుణంగా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించామని దర్శకుడు ధృవశేఖర్ తెలిపారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా తప్పక విజయవంతం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రానికి సంగీతం రవి నిడమర్తి, ఎడిటింగ్ కిరణ్‌కుమార్, పాటలు రాంబాబు, గోశాల, నిర్మాత భరత్ అవ్వారి, రచన, దర్శకత్వం ధృవశేఖర్.