@ రూ.1500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడోవారంలో కూడా పూర్తిస్థాయి హవా ప్రదర్శిస్తోంది. అన్ని చోట్లా దాదాపు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోందని చిత్ర బృందం చెప్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ.1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుని ప్రస్తుతం 19 రోజులు గడిచేసరికి రూ.1500 కోట్ల క్లబ్ చేరువలోకి వెళ్లింది. తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం ఇండియాలో రూ.1189 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో రూ.261 కోట్ల షేర్‌ను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.1450 కోట్ల గ్రాస్ నమోదు చేసి ఇంకొద్ది రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌కు చేరుకోనుంది. ఇలా మూడు వారాలు కూడా పూర్తిగా గడవకముందే ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ చిత్రం పూర్తి రన్‌లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.