పిల్లలకు నా సినిమాలు చూపించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా రీసెంట్‌గా ఓ మాట చెప్పింది. నా సినిమా చూడటానికి వచ్చేవారు మీ పిల్లలను తీసుకొని రావద్దు అని. పిల్లలని తీసుకొని వెళ్లడానికి ఆమెకు వున్న ప్రాబ్లం ఏంటి అని అందరూ అనుకోవచ్చు. ప్రియాంక ఆలోచన మాత్రం మరోలా ఉంది. సినిమా ప్రచారంలో హీరోయిన్స్ అందరూ మా సినిమా చూడండి, చాలా బాగుంటుంది అని చెబుతూ వుంటే.. ప్రియాంక మాత్రం నా సినిమా మీరు చూడండి కాని పిల్లలను మాత్రం తీసుకొని రావద్దు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. కారణం ఏంటని అడిగితే, త్వరలో రాబోతున్న తాను నటించిన బేవాచ్ మూవీలో బికినీ అందాలు ఎక్కువగా ఉంటాయని, అడల్ట్‌గ్రేడ్ సినిమా కావడంవలన ఆ సినిమాకి పిల్లల్ని దూరంగా ఉంచాలని చెబుతోంది. ఈ మాట విన్న అందరూ ప్రియాంక చాలా మంచి మాట చెప్పిందని అనుకుంటున్నారు. మా ప్రియాంక తప్ప ఈ రోజుల్లో ఇలా ఆలోచించేవారు ఎవరుంటారు చెప్పండి అని ప్రియాంక చోప్రా అభిమానులు అంటున్నారు. మొత్తానికి ప్రియాంక చాలా మంచి సలహా ఇచ్చింది.