సాహసాల సంఘమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమా కొత్త ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా భారతీయ సినిమాపై అత్యంత భారీ ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో సినిమా తీయడానికి అప్పుడే చాలామంది దక్షిణ నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. బాహుబలి ఘనవిజయం సాధించడంతోపాటు ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1500 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితో చారిత్రక నేపథ్యంలో మరో సినిమా సంఘమిత్ర తెరకెక్కబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో శృతిహాసన్, జయం రవి, ఆర్యల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పోస్టర్ విడుదల చేయడం విశేషం. ఎపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. శృతిహాసన్ గుర్రపు స్వారీ చేస్తోన్న లుక్ ఒకటైతే, సముద్రంలో ఓడపై ఆర్య నిలబడిన పోస్టర్ మరొకటి. మరుగున పడిన మన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ తరహా చిత్రాలు ముందుకు రావడం మంచి పరిణామమే.