బెలూన్ భయపెడితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై, అంజలి జంటగా 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై పిఎన్ అరుణ్ బాలాజీ కందస్వామి, నందకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బెలూన్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ శీనీష్ మాట్లాడుతూ కొడైకెనాల్‌లో సినిమా షూటింగ్ జరిగిందని, రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రంలో కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. జై, అంజలి కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే హారర్ చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నామని, యువన్ శంకర్‌రాజా నేపథ్య సంగీతం చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు నిర్మాతలు వెల్లడించారు.